యాక్షన్ సంచలనం బోయపాటి శ్రీను `అఖండ 2` తో పాన్ ఇండిమా మార్కెట్ లో కి అడుగు పెట్టిన సంగతి తెలి సిందే. సినిమాకు డివైడ్ టాక్ తో రన్నింగ్ లో ఉంది. సనాతన ధర్మం పేరుతో మార్కెట్ లోకి బాగానే తీసుకెళ్లారు. కానీ ఆరకంగా అందరికీ కనెక్ట్ అయిందా? లేదా? అన్న దానిపై అనేక సందేహాలున్నాయి. వాటితో పనిలేకుండా టీమ్ మాత్రం రిలీజ్ అనంతరం కూడా సనాతన దర్మం పాయింట్ నే హైలైట్ చేస్తూ జనాల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లే ప్రయత్నాలైతే జోరుగా సాగుతున్నాయి. మరి లాంగ్ రనల్ బాలయ్య ఎంత సాధిస్తారు? అన్నది చూడాలి.
ఆ సంగతి పక్కన బెడితే? బోయపాటి తదుపరి హీరో ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. అతడు పాన్ ఇండియా స్టార్ అవుతాడా? రీజనల్ స్టార్ అవుతాడా? బోయపాటి మరోసారి పాన్ ఇండియా చిత్రమే చేస్తాడా? `అఖండ 2` ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తాడా? ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. పాన్ ఇండియా బిగ్ స్టార్స్ అయిన రామ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ లాంటి వాళ్లు వెరీ బిజీ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బోయపాటితో ముందుకెళ్లే అవకాశం లేదు. వాస్తవానికి బన్నీతో బోయపాటి ఓ సినిమా చేయాలి. కానీ అది బన్నీ పాన్ ఇండియా స్టార్ కానప్పటి ప్రామిస్. ఇప్పుడతడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. అట్లీ సినిమాతో బన్నీ ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ నే టార్గెట్ చేసాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బోయపాటి రిస్క్ తీసుకునే అవకాశమైతే లేదు. రామ్ చరణ్ కి కూడా `వినయ విధేయ రామ`తో బోయపాటి ప్లాప్ ఇచ్చాడు.
ప్రభాస్, ఎన్టీఆర్ కూడా బోయపాటితో అంత ఈజీగా రిస్క్ తీసుకోరు. ఈ నేపథ్యంలో బోయపాటికి చిరంజీవి ఓ ఆప్షన్ గా చెప్పొచ్చు. బోయపాటితో ఓ సినిమా చేస్తానని చిరు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కమర్శియల్ మాస్ స్టోరీలు అంటే చిరు కూడా ఎంతో లైక్ చేస్తారు. కాబట్టి చిరు-బోయపాటి కాంబినేషన్ కు అవకాశ మైతే ఉంది. మరి బోయపాటి మనసులో ఉన్న హీరో ఎవరో తెలియాలి.




ప్రభాస్ వల్ల అవుతుందా.. 
Loading..