Advertisementt

ట్రోల్స్ వల్ల హీరో అయ్యాడంట

Mon 15th Dec 2025 03:28 PM
venu swamy  ట్రోల్స్ వల్ల హీరో అయ్యాడంట
Venu Swamy on Social media Trolls ట్రోల్స్ వల్ల హీరో అయ్యాడంట
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో హీరో అవ్వాలన్నా, జీరో అవ్వాలన్నా దానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అన్నట్టుగా ఉంది వ్యవహారం. నెగెటివ్ గా అయినా, పాజిటివ్ గా అయినా ఎలాగోకల ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా తనని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినందువల్ల తను హీరో అయ్యాను అంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిజమే వేణు స్వామి అనే అతను ఎవరికీ తెలియదు. కానీ ఆయన సినీ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవడము, ఆయన్ని ట్రోల్ చెయ్యడమే వల్లే వేణు స్వామి అనే అతను ఫేమస్ అయ్యాడు. అదే నిజం. ఆ విషయము వేణు స్వామీ ఒప్పుకుంటున్నాడు. తనని సోషల్ మీడియాలో ట్రోల్స్ చెయ్యడం వల్లే తను హీరో అయ్యాను అని.

అక్కినేని ఫ్యామిలీ, అలాగే ప్రభాస్, ఇక ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు సీఎం అవ్వడు, జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఎంతగా దుమారాన్ని రేపాయో అందరికి తెలిసిన విషయమే. ఇక తాజాగా ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్ గెలవడం కూడా తన పూజల ఫలితమే అంటూ వేణు స్వామి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 

 

Venu Swamy on Social media Trolls:

 Venu Swamy Claims Social media Made Him Hero

Tags:   VENU SWAMY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ