Advertisementt

అత‌డు పుట్టుక‌తోనే పోరాట యోధుడు

Mon 15th Dec 2025 01:15 PM
manoj bajpayee  అత‌డు పుట్టుక‌తోనే పోరాట యోధుడు
Manoj Bajpayee On Bollywood Work Style అత‌డు పుట్టుక‌తోనే పోరాట యోధుడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వైవిథ్య‌మైన న‌ట‌న‌, పాత్ర‌ల‌తో  ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటాడు. ఇన్నోవేటివ్ క‌థ‌ల్లో న‌టించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ పాత్ర‌ల‌కు అత‌డు భిన్నమైన పాత్ర‌ల‌తో  ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతాడు. బాలీవుడ్ లో అత‌డిని ఓ రేర్ న‌టుడిగా చెప్పొచ్చు. అందుకే సినిమాల‌తో పాటు, వెబ్ సిరీస్ ల్లోనూ బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం `పోలీస్ స్టేష‌న్ మెయిన్ బూత్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.

 

తాజాగా హిందీ ప‌రిశ్ర‌మ‌లో న‌టుల మ‌ధ్య అభ‌ద్ర‌తా భావం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. హిందీ న‌టుల ఎప్పుడు ఒక‌రికొక‌రు ప్ర‌శంసించుకోరన్నారు. `వారిలో అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌. అందుకే ఒక‌రి ప‌నిని అభినం దించ‌డానికి క‌నీసం ఫోన్  కూడా చేయ‌రు. వారిలో పోటీ భ‌యం చాలా లోతుగా ఉంటుంది. కానీ నేను మాత్రం ఇప్ప‌టికీ మంచి పాత్రలు కావాల‌ని ఫోన్ చేసి అడుగుతాను. నా ప‌ని గురించి కూడా ఓపెన్ గా ప్రేక్ష‌కుల్ని అడిగి తెలుసుకుంటానన్నారు.

 

చాలా మంది  ప‌రిశ్ర‌మ అంటే?  గ్లామ‌ర్, బాక్సాఫీస్  వ‌సూళ్లు, విజ‌యాలు మాత్ర‌మే అనుకుంటారు. కానీ వెర వెనుక వాస్త‌వం మ‌రోలా ఉంటుంద‌న్నారు. రోజు ఎంతో మంది న‌టులు ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌డానికి తిరుగుతుంటారు. అంత కాంపిటీ ష‌న్ లో కాళాకారుడు నిలదొక్కుకోవ‌డం అంత సుల‌భం కాదు. న‌టుల‌కు ఇక్క‌డ ఎలాంటి హామీ ఉండ‌దు. ఓ సినిమా లో న‌టించి స‌క్సెస్ అయినా?  మ‌రో సినిమాలో ఛాన్స్ వ‌స్తుంద‌నే గ్యారెంటీ ఉండదు.

 

అదంతా అదృష్టంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. రోజు ప్ర‌తీ న‌టుడు త‌న‌ని తాను నిరూపించుకోవాల్సిందే. నేను కూడా అంతే. డే మొద‌లు రాత్రి వ‌ర‌కూ అలాగే ఉంటాను. అందుకే నేను పుట్టుక‌తోనే పోరాట యోధుడిగా భావిస్తుంటాను అని తెలిపారు. మ‌నోజ్ బాజ్ పాయ్ తెలుగు న‌టుల‌కు సుపరిచిత‌మే. `హ్యాపీ`, `కొమరం పులి` లాంటి చిత్రాల్లో  న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

Manoj Bajpayee On Bollywood Work Style:

Manoj Bajpayee On His Working Style

Tags:   MANOJ BAJPAYEE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ