బిగ్ బాస్ సీజన్9 లో కొన్ని కొన్ని వారాలు అసలు వోటింగ్ తో సంబంధమే లేకుండా ఎలిమినేషన్ జరిగాయి. అలా శ్రీజ, నిఖిల్, మొన్న రీతూ చౌదరి ఎలిమినేషన్ లు అలానే జరిగాయి. రీతూ చౌదరి ఎలిమినేష, శ్రీజ ఎలిమినేషన్ రెండు షాకింగ్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సుమన్ శెట్టి శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు.
ఇక రెండో ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది పెద్దగా క్యూరియాసిటీ లేదు. కారణం భరణి ఎలిమినేషన్ అనివార్యం. సంజన ను టాప్ 5 కి పంపించి భరణిని ఎలిమినేట్ చేసే ప్లాన్ చేసారు. అందులో భాగంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా భరణిని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది.
టాప్ 5లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన ఉన్నారు. ఈ వారం సుమన్ శెట్టి, భరణి లు ఎలిమినేట్ అయ్యి ఇంటికెళ్ళిపోయినట్లుగా తెలుసుంది.. నిజానికి భరణికి సంజన కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పటికీ, ఊహించని విధంగా ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.




సీనియర్లు ఉన్నా యవ్వా తగ్గేదేలే
Loading..