2026 సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ పోటాపోటీగా బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. తొలుత సంక్రాంతి హడావుడి `రాజాసాబ్` రిలీజ్ తో మొదల వుతంది. జనవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనంతరం `మనశంకర ప్రసాద్`, `భర్త మహాశయులకు` విజ్ఞప్తి చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఆ రెండు రిలీజ్ లు ఇంకా డేట్లు ఫిక్స్ చేయలేదు.ఒకటి రెండు..రోజులు అటు ఇటుగానే ఆ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. దీంతో ముగ్గురు హీరోల మధ్య పోటీ తప్పదు.
ఎవరి బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ గా నిలిచేది? అంటూ ఆసక్తికర చర్చా జరుగుతోంది. ఇలా ముగ్గురు స్టార్లు పోటీ పడుతున్నా? వాళ్లకు ఎంత మాత్రం తగ్గకుండా బరిలోకి దిగుతున్నారు యువ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్. నవీన్ హీరోగా నటిస్తోన్న `అనగనగా ఒక రాజు`, శర్వానంద్ నటిస్తోన్న `నారీ నారీ నడుమ మురారీ` ఒకే రోజు జనవరి 14న రిలీజ్ అవుతున్నాయి. ముందు సీనియర్లు ఉన్నా? ఈ యంగ్ స్టార్లు ఇద్దరు ఎంత మాత్రం బెదరకుండా బరిలోకి దిగుతున్నారు.
నవీన్ సినిమా ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా? శర్వానంద్ మాత్రం మొన్నటి వరకూ డైలమాలో కనిపించాడు. రిలీజ్ చేయాలా? వద్దా? అన్న ఆలోచనతో ఉన్నాడు. చివరిగా సంక్రాంతి సెంటిమెంట్ గుర్తొచ్చి సీన్ లోకి దిగిపో యాడు. 2016, 2017 సంక్రాంతికి శర్వా ఇలాగే పోటీబడి బాక్సాఫీస్ వద్ద గెలిచాడు. సీనియర్ హీరోల రిలీజ్ లు ఉన్నా? ఎంత మాత్రం భయ పడకుండా రెండు సంవత్సరాలు సంక్రాంతి స్టార్ గా నిలిచాడు.
ఇప్పుడు అదే నమ్మకంతో `నారీ నారీ నడుమ మురారీ`ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రచారం కీలకం. ఇంత వరకూ టీమ్ లు ప్రచారం పై దృష్టి పెట్టలేదు. రిలీజ్ కు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా? ఇప్పటి నుంచి మొదలు పెడితే గానీ ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కష్టం. కాంపిటీషన్ లో అగ్ర హీరోల సినిమాలను దాటాలంటే నెల రోజుల ప్రచారం కీలకం.




షారూఖ్- కపూర్ కాంబినేషన్
Loading..