ఈ వారం బాక్సాఫీసు చిన్న సినిమాల్తో సరిపెట్టుకుంది. అల్లరి నరేష్ లాంటి క్రేజీ హీరో నటించిన 12A రైల్వే కాలనీ, సక్సెస్ కి దొరమైపోతున్న రాజ్ తరుణ్ పాంచ్ మినార్, కామెడీగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతున్న ప్రియదర్శి ప్రేమంటే, అనూహ్యంగా లైన్ లోకి వచ్చిన చిన్న సినిమా రాజు వెడ్ రాంబాయి, ఇట్లు మీ వెధవ లాంటి చిన్న చిత్రాలు ఈ వారం బాక్సాఫీసు దగ్గర సందడి చేసాయి.
మరి ఈ వారం విడుదలైన ఈ చిత్రాల్లో, హీరోల్లో గెలుపెవరిది అనే విషయం విడుదలైన మొదటి షో తోనే తేలిపోయింది. అల్లరి నరేష్ నంది తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్నా అతనికి విజయం దక్కడం లేదు. ఇప్పుడు ఈ 12 A రైల్వే కాలనీ కూడా ఆడియన్స్ ను మాత్రమే కాదు అల్లరోడి నమ్మకాన్ని ముంచేసింది,
ఇక ప్రియదర్శి - ఆనంది జంటగా వచ్చిన ప్రేమంటే కి మిక్స్డ్ రివ్యూస్ కనిపించాయి. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినబడుతున్నా క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం ఎఫెక్ట్ అయ్యింది. ఇక మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకుని బెటర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
కంటెంట్ పరంగా రాజు వెడ్స్ రాంబాయి యూత్ కి కనెక్ట్ అవడమే కాదు ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరూ ఎబోవ్ యావరేజ్ రెస్పాన్స్ చూపించడం రాజు వెడ్స్ రాంబాయి కి ప్లస్ అయ్యింది. ఈ వారం ఈ చిత్రమే బాక్సాఫీసు విన్నర్.
ఇక రాజ్ తరుణ్ పాంచ్ మినార్ కూడా డిజప్పాయింట్ చేసింది, మిగతా సినిమాలు అసలు ఏ థియేటర్స్ లో విడుదలయ్యాయి అనేది చెప్పడము కష్టమే.




NC24 కి షాకింగ్ బడ్జెట్
Loading..