తండేల్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు తో NC24 చేస్తున్నారు. ఈ NC24 కి సంబంధించిన BTS వీడియోలో నాగ చైతన్య యాక్షన్ సీక్వెన్స్ అలాగే NC24 సెట్, అందుకు పని చేస్తున్న సిబ్బంది ఇలా సెటప్ అంతా చాలా భారీగా కనిపించింది.
ఇది చూసాక దర్శకుడు కార్తీక్ దండు నిర్మాతల చేత భారీగానే బడ్జెట్ పెట్టిస్తున్నట్టుగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో NC24 కి టోటల్ బడ్జెట్ అంటే మేకింగ్, అలాగే నటుల పారితోషికాలు కలిపి 120 కోట్ల మేర బడ్జెట్ NC24కి ఎక్కుతుంది. మరి ఇది నిజంగా షాకింగ్ బడ్జెట్ అనే చెప్పాలి.
ఈ బడ్జెట్ చూసి అక్కినేని ఫ్యాన్స్ తమ హీరో రేంజ్ పెరిగింది అంటూ మాట్లాడుకుంటుంటే.. కొంతమంది మాత్రం నాగ చైతన్య పై ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు చైతు బర్త్ డే. ఈ సందర్భంగా NC 24 టైటిల్ ని సూపర్ స్టార్ మహేష్ రివీల్ చెయ్యబోతున్నారు.




సక్సెస్ ని గ్లామర్ గా ఎంజాయ్ చేస్తున్న భామ
Loading..