రవితేజ కు బ్యాక్ టు బ్యాక్ నిరాశలే. ధమాకా హిట్ తర్వాత మళ్ళి ఆ స్థాయి హిట్ కోసం మాస్ రాజా తపన పడుతున్నాడు. కథల ఎంపికలో లోపమో, లేదంటే దర్శకులు రవితేజ ని మోసం చేస్తున్నారో తెలియదు కానీ.. రవితేజ మాత్రం అభిమానులను నిరాశపరిచే సినిమాల్తో డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది తన లక్కీ గర్ల్ శ్రీలీల తో మాస్ జాతర తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
ఎన్నడూ లేని విధంగా మాస్ జాతరను రవితేజ ప్రమోట్ చేసాడు. టీమ్ ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ హడావిడి చేసారు. నవంబర్ 1 న విడుదలైన ఏ ఈసినిమాకి నిర్మాత నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒకరోజు ముందే అక్టోబర్ 31 నే పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చేసారు. పెయిడ్ ప్రీమియర్స్ కి వర్కౌట్ అయ్యింది. ప్రీమియర్స్ తోనే మాస్ జాతర 5 కోట్లు తీసుకొచ్చింది.
కానీ సినిమాకి యావరేజ్ టాక్ పడింది. రవితేజ మాస్ జాతర ప్రీమియర్స్ పూర్తవడం పాపం సోషల్ మీడియాలో మాస్ జాతర చూస్తే రవితేజ గత సినిమాలు మిక్సీలో వేసి రుబ్బినట్లుంది మాస్ జాతర అన్నారు, కానీ ఎక్కడా ఆ రేంజ్ జాతర కనిపించలేదు అంటూ సోషల్ మీడియాలో మాస్ జాతరపై నెగిటివిటి స్టార్ట్ చేసారు.
సిని విమర్శకులు సైతం జాతర కు జస్ట్ యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు. అటు కంటెంట్ విషయంలోనూ ఆడియన్స్ యావరేజ్ రెస్పాన్స్ చూపించారు. మరి ఈ టాక్ తో మాస్ జాతర ఎంతవరకు గట్టెక్కుతుందో చూడాలి.




                     
                      
                      
                     
                    
 అల్లు శిరీష్-నయనిక మేడ్ ఫర్ ఈచ్ అదర్

 Loading..