Advertisementt

అవార్డులు బోగ‌స్ అనేసిన న‌టుడు

Mon 03rd Nov 2025 09:08 PM
paresh rawal  అవార్డులు బోగ‌స్ అనేసిన న‌టుడు
Paresh Rawal admits lobbying exists in National Awards అవార్డులు బోగ‌స్ అనేసిన న‌టుడు
Advertisement
Ads by CJ

జాతీయ అవార్డుల‌పై చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ అవార్డుల‌ను కొనుక్కుంటార‌ని చిన్న చూపు చూసేవాళ్లు ఉన్నారు. అయితే జాతీయ అవార్డుల్లో లాబీయింగ్ ఉన్నా కానీ, అది ప‌రిమితంగా మాత్ర‌మే ఉంటుంద‌ని, ఇత‌ర అవార్డుల‌తో పోలిస్తే గౌర‌వ‌నీయ‌మైన అవార్డులు ఇవి అని కితాబిచ్చారు ప‌రేష్ రావ‌ల్.

జాతీయ అవార్డుల్లోనే కాదు.. ఆస్కార్ పుర‌స్కారాల ప్ర‌చారంలోను బోలెడంత లాబీయింగ్ న‌డుస్తుంద‌ని ప‌రేష్ రావ‌ల్ అన్నారు. నెట్ వ‌ర్కింగ్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసే పెద్ద వాళ్లుంటార‌ని కూడా సీనియ‌ర్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌గా మారింది. అత‌డికి `వో చోక్రి` (1994) అనే చిత్రానికి గాను ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు ల‌భించింది. ఆ త‌ర్వాత ప‌రేష్ రావ‌ల్ ఎన్నో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లతో ఆక‌ట్టుకున్నాడు. అయితే లాబీయింగ్ కార‌ణంగా వ‌చ్చే అవార్డులు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని అత‌డు అన్నాడు. త‌న ప‌రిశ్ర‌మ‌లో క్రియేటివ్ స‌హ‌చ‌రుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కితే చాలున‌ని అన్నారు.

ప‌రేష్ రావ‌ల్ ఇటీవ‌లే `థామా` చిత్రంలో క‌నిపించారు. అత‌డు న‌టించిన `ది తాజ్ స్టోరి` వివాదాల‌ను మోసుకొచ్చింది. త‌దుప‌రి హేరాఫేరి 3, వెల్ కం టు ది జంగిల్ స‌హా ప‌లు చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

Paresh Rawal admits lobbying exists in National Awards:

Paresh Rawal shared that even prestigious honours like the National Awards

Tags:   PARESH RAWAL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ