అంతగా పర్యవేక్షణ లేని చీటీ పద్దుల మోసాల గురించి నిరంతరం వింటూనే ఉన్నాం. అయితే దీనికి భిన్నంగా కొందరు కంపెనీలను ప్రారంభించి పెట్టుబడిదారులకు వాటాలు ఇస్తామని, లాభాలు భారీగా దండుకోవచ్చని హామీలు ఇస్తూ మోసానికి పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కంపెనీలు బోర్డులు తిప్పేయడం, బాధితులను రోడ్డున పడేయడం సహజ ప్రక్రియగా మారింది.
తాజా సమాచారం మేరకు.. తెలుగు చిత్రసీమలో పలువురు ప్రముఖ హీరోలకు హెయిర్ స్టైలిష్ట్ గా పని చేసి, హిందీ చిత్రసీమలోను దిగ్గజాలకు హెయిర్ డిజైనర్ గా పని చేసిన ఒక ప్రముఖుడిపై పలు చోట్ల 32 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని కథనాలొస్తున్నాయి. సౌందర్య ఉత్పత్తుల రంగంలో పెట్టుబడుల పేరుతో దాదాపు 200 మంది నుంచి 5 కోట్లు పైగా వసూలు చేసి రిటర్నులు ఇవ్వడంలో విఫలమవ్వడంతో పెట్టుబడిదారులు తిరగబడ్డారు. వారంతా అతడిపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసారు.
దీంతో దిగి వచ్చిన సదరు సెలబ్రిటీ స్టైలిష్ట్ నష్టపోయిన పెట్టుబడి దారులకు తిరిగి చెల్లింపులు ప్రారంభించారని తెలిసింది. ఇటీవల ఎంపిక చేసిన పెట్టుబడిదారులకు చిన్న మొత్తాలను అతడు చెల్లించారు. అయితే బకాయి సొమ్ములు అతడి నుంచి తిరిగి వస్తాయా లేదా? అన్నదానిపై స్పష్ఠత లేదని పోలీసులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది ప్రముఖులు బ్రాండ్ పేరును దుర్వినియోగం చేస్తూ, ఇలాంటి మోసాలకు పాల్పడటంతో చిన్న- మధ్యతరగతి ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో సదరు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ దేశం విడిచి వెళ్లనీకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసారని తెలిసింది. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా క్రైమ్ పోలీసులు ప్రజలకు విన్నవిస్తున్నారు.




                     
                      
                      
                     
                    
 BB 9 : భరణి-తనూజ బాండ్ బద్దలైపోయింది 
 Loading..