Advertisementt

పవన్ కళ్యాణ్ పై విమర్శల జడివాన

Thu 18th Sep 2025 01:01 PM
og ticket price hike  పవన్ కళ్యాణ్ పై విమర్శల జడివాన
Pawan kalyan Facing criticism for OG ticket prices పవన్ కళ్యాణ్ పై విమర్శల జడివాన
Advertisement
Ads by CJ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన నటించిన సినిమాలను పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం తొక్కేసేందుకు ప్రయత్నాలు చేసింది. భీమ్లా నాయక్ విషయంలో థియేటర్స్ లో బెన్ఫిట్ షోస్ కి కానీ, అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ అనుమతి ఇవ్వలేదు.

కానీ ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కీలకంగా ఉన్నారు. అందుకే హరి హర వీరమల్లు సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు OG బెన్ఫిట్ షో టికెట్లను ఇష్టానురాజ్యంగా 1000 రూపాయలకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం, అలాగే టికెట్ రేట్స్ హైక్, పెరిగిన రేట్లు పది రోజులు అమలు చేసుకునేలా జీవో పాస్ చేసింది ఏపీ ప్రభుత్వం.

దానితో పవన్ కళ్యాణ్ పై విమర్శలు మొదలయ్యాయి. జగన్, మిగతా వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు. మీరు మాత్రం టికెట్ రేట్లు పెంచుకుని ప్రేక్షకులను జేబులకు చిల్లులు పెడుతున్నారు. మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన OG కి ఈ స్థాయిలో టిక్కెట్ల రేట్లు పెంచడం వెనక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు మొదలుపెట్టారు.

రైతుల ఉల్లికి 30 పైసలు, టమాటాకి రూపాయి.. కేవలం మూడు గంటల సినిమాకి వెయ్యి రూపాయలా ఇదేనా పవన్ మీరు నీతిగా నిజాయితీగా పాలన జరిపేది అంటూ నెటిజెన్స్ పవన్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

Pawan kalyan Facing criticism for OG ticket prices:

  OG ticket price Hike  Pawan kalyan Facing criticism  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ