బిగ్ బాస్ సీజన్ 9 ఎలా మొదలు పెడతారు, అసలు హౌస్ లో ఈసారి కథ ఏమిటి అనేది చాలామందికి అర్ధం కావడం లేదు. ఎప్పుడు చూసే టాస్క్ లు, ప్రతిసారి జరిగే గొడవలు ఇదే తప్ప ఇంకేం ఉంటుంది అంటూ ప్రేక్షకులు అప్పుడే పెదవి విరుస్తున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ మారిపోయాడు, సీజన్ 9 పై క్రేజ్ పెరిగేలా నాగర్జున ప్రోమోస్ వరసగా వస్తున్నాయి.
అన్నిటికి మించి బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష అంటూ జియో హాట్ స్టార్ లో హడావిడి.అందులో కంటెస్టెంట్స్ ఎంపిక కోసం పెట్టె టాస్క్ లు చూసి అదేమిటి బిగ్ బాస్ హౌస్ లో పెట్టాల్సిన టాస్క్ లు ఇప్పుడు అగ్నిపరీక్ష స్టేజ్ పై పెట్టేసారు, మరి హౌస్ లో ఇంకేం కొత్త టాస్క్ లు పెడతారంటూ బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ ఒక్కటి కాదు రెండు అంటూ ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్ మ్యాన్ కోసం అని క్లారిటీ ఇచ్చేసారు. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలు కాబోతున్నట్టుగా ప్రోమో వదిలారు. టాస్కులు, గేమ్స్ ల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రోమోను కూడా డిఫరెంట్ గా కట్ చేశారు. చూద్దాం ఈ సీజన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది.