విడాకులతో దూరమైనా కానీ, ఇప్పటికీ చాహల్, ధనశ్రీ ఒకరినొకరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అది కోపంగానో లేదా విచారంగానో, ఇంకైదైనా కారణంతోనో.. మొత్తానికి ఒకరినొకరు టచ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ధనశ్రీ పాపులర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నట్టుండి విడాకుల తీర్పు వచ్చే రోజున అతడు (చాహల్) కోర్టు గడపలోకి అడుగుపెట్టేప్పుడు మీ సొంత సుగర్ డాడీగా ఉండండి! అనే క్యాప్షన్ తో టీషర్ట్ స్టంట్ చేసాడు. ఆ విషయం నాకు తెలిసే లోపే బయట ప్రజలకు తెలుసు. వారంతా నన్ను నిందించారు. అలాంటి సున్నితమైన సమయంలో అతడు అలా చేయడం బాధించింది! అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అయితే ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు చాహల్ తనదైన శైలిలో ప్రతిస్పందించాడు. అతడి పోస్ట్ క్రిప్టిక్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ప్రకారం ``మిలియన్ ఫీలింగ్స్.. జీరో వర్డ్స్`` అని సోషల్ మీడియాల్లో రాశారు. ఇది కచ్ఛితంగా ధనశ్రీ ఇంటర్వ్యూకు కౌంటర్ అని ఊహిస్తున్నారు. అతడు నర్మగర్భంగా తన మాజీకి ఏదో చెప్పదలిచాడు. దాని వెనక చాలా అర్థం దాగి ఉంది! అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ 2020లో ఈ జంట పెళ్లయిది. కేవలం నాలుగళ్లకే విడాకులైంది. విడాకులకు ముందు ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు తీవ్రంగా వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ వేదికగా ఇది పెద్ద చర్చకు తెర తీసింది.