బిగ్ బాస్ సీజన్ 9 ని ఎలాగైనా ఆడియన్స్ దగ్గరకు చేర్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఎంతో కష్టపడుతుంది. అందులో భాగమే అగ్నిపరీక్ష అంటూ హడావిడి. బిగ్ బాస్ సీజన్స్ పాత కంటెస్టెంట్స్ తో కలిసి బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లే కామన్ ఆడియన్స్ ను ఎంపిక చేసేందుకు చేసే ప్రయత్నాలు అప్పుడే సీజన్ 9 పై చిరాకు తెప్పిస్తున్నాయి.
అభిజిత్, బిందు మాధవి, నవదీప్ లను జెడ్జి లుగా పెట్టి అగ్నిపరీక్ష ఆడిస్తున్నారు. ఇక కామన్ ఆడియన్స్ గా బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు వస్తున్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు స్టేజ్ పై తమ ప్రతాపం చూపిస్తున్నారు. అగ్నిపరీక్ష ప్రోమోస్ అంటూ వన్ బై వన్ వదులుతూ స్టార్ మా అప్పుడే రచ్చ స్టార్ట్ చేసింది.
అసలు ఈ అగ్నిపరీక్ష పూర్తయ్యి బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యేవరకు ఈమద్యలో ఆడియన్స్ లో సీజన్9 పై ఏమైనా క్రేజ్ మొదలవుతుందా. అగ్నిపరీక్ష పై అటెన్షన్ క్రియేట్ అవుతుందా అనేది అసలైన ప్రశ్న. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ ను వాడుతున్నారు. మరి ఈ సీజన్ పై ఎంత క్రేజ్ ఉంటుందో, ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.