నిన్నటితో కూలి-వార్ 2 లకు లాంగ్ వీకెండ్ ముగిసింది. ఆగష్టు 14 న విడుదలైన ఈ రెండు చిత్రాలకు సూపర్ హిట్ టాక్ పడకపోవడంతో కేవలం ఫస్ట్ వీకెండ్ వరకే కూలి అయినా, వార్ 2 అయినా నిలబడేది అనుకునేలా శుక్ర, శని,ఆది వారాల టికెట్ బుకింగ్స్ కనిపించాయి. మొదటి మూడు రోజులు రెండు సినిమాలు గట్టిగానే కలెక్ట్ చేసాయి.
నెగెటివ్ టాక్ రాలేదు కానీ.. మిక్స్డ్ టాక్ రావడంతో రెండు సినిమాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ కనిపించింది. అయితే వార్ 2 కన్నా కలెక్షన్స్ విషయంలో కూలి నే బెటర్ గా పెరఫార్మ్ చేసింది అనేలా కూలి కలెక్షన్స్ ఉన్నాయి. మొదటి వీకెండ్ ముగిసేసరికి కూలికి పాన్ ఇండియా వ్యాప్తంగా మూడు వందల కోట్లు కలెక్షన్స్ వస్తాయని అంచనా ఉంది.
కానీ వార్ 2 కి 200 కోట్లు మాత్రమే వచ్చేలా ఉంది వ్యవహారం. మరి వీకెండ్ మాట ఎలా ఉన్న ఈరోజు సోమవారం నుంచి కూలి-వార్ 2 అసలు పరీక్షకు సిద్దమవ్వాల్సిందే. ఇప్పటికే వార్ 2 థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తగ్గింది, కూలి ఎలాగోలా వీకెండ్ బెటర్ గా కనిపించింది. కానీ ఈ సోమవారం పరీక్షలో కూలి, వార్ 2 రెండిటిలో ఏది గెలుస్తుంది, ఏది ఓడుతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది