Advertisementt

విజయ్ దేవరకొండ పెళ్లికి లేట్ ఎందుకంటే

Sun 27th Jul 2025 04:26 PM
vijay devarakonda  విజయ్ దేవరకొండ పెళ్లికి లేట్ ఎందుకంటే
Why Vijay Devarakonda delaying marriage విజయ్ దేవరకొండ పెళ్లికి లేట్ ఎందుకంటే
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న డేటింగ్ లోనే ఉన్నారనే వార్త ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తుంది మాట. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్, లంచ్ డేట్, అలాగే సీక్రెట్ గా వెకేషన్స్ కు వెళుతూ ఉంటారు. కానీ మా మధ్యలో ఏమి లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మి మాత్రమే, ఏ.. ఫ్రెండ్స్ డిన్నర్ డేట్స్ కి వెకేషన్స్ కి వెళ్ళకూడదా అంటూ వితండవాదం చేస్తారు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యామిలీకి గర్ల్ ఫ్రెండ్ కి సమయం కేటాయించలేకపోతున్నా అంటూ చేసిన కామెంట్స్ రష్మిక ని ఉద్దేశించే అనుకున్నారు. తనకు 35 వచ్చేసాయి, పెళ్లిపై గాలి మళ్లింది అంటూ విజయ్ దేవరకొండ కామెంట్లు చెయ్యడంతో అతని పెళ్లి మరో ఏడాదిలో ఉండొచ్చనే హింట్ ఇచ్చాయి.

అయితే విజయ్ దేవరకొండ పెళ్లికి రెడీ అయినా.. రష్మిక మందన్న క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఉండడంతో విజయ్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడని, రష్మిక మరో ఏడాదిన్నర ఖాళీ లేకుండా సినిమాలు ఒప్పేసుకుని, అప్పటివరకు ఆమె పెళ్లి చేసుకునే ఉదేశ్యంలో లేదు అందుకే విజయ్ దేవరకొండ పెళ్ళి లేట్ అవుతుంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు సినీజనాలు. 

Why Vijay Devarakonda delaying marriage:

  Vijay Devarakonda wants to spend more time with his girlfriend  

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ