జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్`తో దేవర చిత్రంలో నటించింది. తొలి ప్రయత్నమే గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` అనే చిత్రంలోను నటిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రీడా నేపథ్య చిత్రంలో జాన్వీకపూర్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, సినిమాలతో పాటు లవ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ జాన్వీ కపూర్ తెలివిగా ముందుకు సాగుతోంది. సినీపరిశ్రమలో ప్రవేశించే చాలామంది యువ కథానాయికలతో పోలిస్తే, జాన్వీ మూవ్ చాలా స్ట్రాటజికల్ గా ఉంది. జాన్వీ ఇక్కడ ప్రవేశిస్తూనే తన ప్రియుడు శిఖర్ పహారియాను అందరికీ పరిచయం చేసింది. వీలున్న ప్రతిసారీ జాన్వీకపూర్ ప్రియుడితో పబ్లిగ్గా కనిపిస్తోంది. ఇంతకుముందు తిరుమలేశుని దర్శనంలో పలుమార్లు శిఖర్ తో కనిపించిన జాన్వీ కపూర్, డిన్నర్ డేట్ లతోను టీజ్ చేసింది. ఇప్పుడు ఏకంగా వింబుల్డన్ 2025 (లండన్) సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తూ జాన్వీ- శిఖర్ జంట కెమెరా కంటికి చిక్కారు.
జాన్వీ స్టన్నర్ అనిపించే లుక్ లో కనిపించగా, శిఖర్ కూడా పోష్ లుక్ లో కనిపించాడు. కార్లోస్ అల్కరాజ్ - టేలర్ ఫ్రిట్జ్ మధ్య జరిగిన మ్యాచ్ లో జాన్వీ- శిఖర్ జంట ప్రధాన ఆకర్షణగా మారారు. అయితే ఈ జంట ఇక్కడికి వస్తుందని ఊహించని అభిమానులు సోషల్ మీడియాల్లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ దంపతులు కూడా వింబుల్డన్ మ్యాచ్ లను వీక్షించారు. షబానా ఆజ్మీ- జావేద్ అక్తర్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈసారి మ్యాచ్ లు వీక్షిస్తూ కెమెరా కంటికి చిక్కారు.