Advertisementt

1000 కోట్ల క్ల‌బ్ లో వీర‌మ‌ల్లు లేదేం

Sat 12th Jul 2025 02:04 PM
hari hara veera mallu  1000 కోట్ల క్ల‌బ్ లో వీర‌మ‌ల్లు లేదేం
Why Hari Hara Veera Mallu not in 1000 crore club 1000 కోట్ల క్ల‌బ్ లో వీర‌మ‌ల్లు లేదేం
Advertisement
Ads by CJ

త్వ‌ర‌లో పాన్ ఇండియాలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అంటే 1000 కోట్ల మాట స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న `కూలీ` 1000 కోట్ల క్ల‌బ్ లో చేరు  తుంద‌ని అంచ‌నాలున్నాయి. `కూలీ` రోజునే బాలీవుడ్ నుంచి  `వార్ -2` కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో హృతిక్ రోష‌న్- యంగై టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ భారీగానే జ‌రిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ కూడా 1000 కోట్ల‌గా క‌నిపిస్తోంది.

ఈ రెండు చిత్రాల‌పై ట్రేడ్ వ‌ర్గాలు కూడా విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ రెండు సినిమాల‌కు ఉన్నంత బ‌జ్ వీర‌మ‌ల్లుపై క‌నిపిం చ‌డం లేదు. ప్ర‌చార చిత్రాల ప‌రంగానూ వీర‌మ‌ల్లు కంటే ఈ రెండు హైలో క‌ని పిస్తున్నాయి. అలాగే  ఈ రెండు సినిమాల కంటే ముందుగా వీర‌మ‌ల్లు ముందు గా రిలీజ్ అవుతుంది.

ఈ నెల 24న చిత్రం రిలీజ్ అవుతుంది. మ‌రి వీర‌మ‌ల్లు టార్గెట్ ఎంత‌? 1000 కోట్ల క్ల‌బ్ లో వీర‌మ‌ల్లు కు ఛాన్స్ ఉందా?  లేదా? అని ఎన్నో సందేహాలున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. పీరి యాడిక్ చిత్రం చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మునుపెన్న‌డు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. పైగా ఈ సినిమా ఐదేళ్ల క్రితం మొద‌లైంది. ఐదేళ్ల త‌ర్వాత రిలీజ్ అవుతుంది. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ప‌ని చేసారు. క్రిష్ త‌ప్పుకోవ‌డంతో  జ్యోతికృష్ణ వ‌చ్చాడు. ఇవ‌న్నీ సినిమాకు కాస్త ప్ర‌తికూల అంశాలే.

అలాగ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి  పాన్ ఇండియా క్రేజ్ లేక‌పోలేదు. రాజ‌కీయంగా  బీజీపీ తో మైత్రీ కార‌ణంగా పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. అటుపై స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌కుడిగా మ‌రింత వైర‌ల్ అయ్యారు. పైగా సినిమాలో కంటెంట్ కూడా స‌నాత‌న ధ‌ర్మ‌మే. ఈ పాయింట్ నే మేక‌ర్స్ కూడా హైలైట్ చేసారు. ఈ రెండు వీర‌మ‌ల్లుకు క‌లిసి రావాలి. మ‌రి అదెంత వ‌ర‌కూ క‌లిసొస్తుందో చూడాలి.  

Why Hari Hara Veera Mallu not in 1000 crore club:

HHVM not in 1000 crore club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ