Advertisementt

నాగర్జున.. దుల్కర్ కొత్త వాళ్లైనా తగ్గేదేలే

Sat 12th Jul 2025 11:31 AM
dulquer and nagarjunawith young directors  నాగర్జున.. దుల్కర్ కొత్త వాళ్లైనా తగ్గేదేలే
Dulquer and Nagarjuna Trust on Young Directors నాగర్జున.. దుల్కర్ కొత్త వాళ్లైనా తగ్గేదేలే
Advertisement
Ads by CJ

ఎట్ట‌కేల‌కు కింగ్ నాగార్జున కొత్త ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ తో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నారు. సెంచ‌రీ కార్తీక్ తోనే కొట్టాల‌ని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. కార్తీక్ కి ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అనుభ‌వం కూడా లేదు. డైరెక్ట‌ర్ గా ఒక సినిమాకే ప‌నిచేసాడు. అదీ కూడా స‌రిగ్గా ఆడ లేదు. అయినా నాగ్ మాత్రం క‌థ‌ను న‌మ్మి కార్తీక్ తో సోలో ప్రాజెక్ట్  చేస్తున్నాడు. కొత్త వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. కెరీర్ ఆరంభం నుంచి నాగ్ కి ఉన్న అల‌వాటు అది.

ఇలాంటి వారి వ‌ల్లే ఇంకా కొత్త వారు వెలుగులోకి రాగ‌లుగుతున్నారు. స‌రిగ్గా ఇదే తీరున మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా సినిమాలు చేస్తున్నాడు. మాలీవుడ్ లో  దుల్క‌ర్ కూడా చాలా మంది కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేసాడు. క‌థ‌.. వాళ్ల‌పై ఉన్న న‌మ్మ‌కంతో కెరీర్ ఆరంభంలోనే సినిమాలు చేసి స‌క్స‌స్ లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ తెలుగు, త‌మిళ మార్కెట్ పై దృష్టి పెట్టి ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలి సిందే.

ఇప్ప‌టికే తెలుగులో పెద్ద స్టార్ గా అవ‌త‌రించాడు.  `సీతారామం`, `ల‌క్కీ భాస్క‌ర్` లాంటి సినిమాలు  దుల్క‌ర్ ఇమేజ్ ని రెట్టింపు చేసాయి. ప్ర‌స్తుతం తెలుగులో ` ఆకాశంలో ఒక తార‌`, త‌మిళ్ లో `కాంత` చిత్రాలు చేస్తున్నాడు.  ఈ రెండు భాష‌ల‌పై ప‌ట్టు రావ‌డంతో  తెలుగులోనూ దుల్క‌ర్ కొత్త వాళ్ల‌ను ప్రోత్స‌హిం చ‌డం మొద‌లు పెట్టాడు. తాజాగా దుల్క‌ర్ తెలుగు లో కొత్త కుర్రాడైన ర‌వి తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఇప్ప‌టికే ర‌వి స్టోరీ వినిపించడం..దుల్క‌ర్ ఒకే చేయ‌డం జ‌రిగిపోయింది.  ఆగ‌స్టులో ఈ చిత్రం ప్రారంభ మ‌వుతుంది. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వీసీ సంస్థ నిర్మించ‌డానికి ముందు కొస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టులో చిత్ర ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని స‌మాచారం.

Dulquer and Nagarjuna Trust on Young Directors:

Dulquer and Nagarjuna giving chance for debutant directors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ