సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో గెస్ట్ పాత్రలు పోషించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు రెండవ భాగంలోనూ యాధావిధిగా కొనసాగుతున్నాయి. వాళ్లతో పాటు ఈసారి నటసింహ బాలకృష్ణ కూడా ఎంటర్ అవుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఎంట్రీ తో `జైలర్ 2` రేంజ్ రెట్టింపు అవుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి.
బాలయ్య మాస్ ఇమేజ్ `జైలర్ 2`కి అదనంగా కలిసొచ్చే అంశంగా వైరల్ అయింది. మరి ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడా? అతిధిగా అలరించనున్నాడా? అంటే సన్నివేశం చూస్తుంటే బాలయ్య ప్రాజెక్ట్ లో లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలై కొన్ని నెలలు గడుస్తోంది. రజనీకాంత్ పై కీలక సన్ని వేశాలు చిత్రీకరించారు. అలాగే శివన్న కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. తాజాగా మోహన్ లాల్ కూడా రెండు రోజులుగా షూట్ కి వెళ్తున్నారు.
చైన్నై లో జరిగే షూటింగ్ కి హాజరవుతున్నారు. ఇందులో రజనీ-శివన్న- లాల్ పై కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య నటిస్తున్నారా? అన్న అంశం కోలీవుడ్ మీడియాలో చర్చకు రాగా ఆయన నటించలేదు అన్న ఓ వార్తను ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచురింత చేసింది. సినిమాలో బాలయ్య భాగం కాలేదని...ఆయన కూడా నటిస్తే ఇంకా హైప్ ఉండేది అన్న విషయాన్ని ప్రచురించారు.
గతంలో నెల్సన్ కూడా బాలయ్య సార్ నటిస్తే బాగుండు అన్నట్లు స్పందించినట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వచ్చింది. కానీ దానికంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. తాజాగా ఆ ప్రముఖ సంస్థ కథనంతో బాలయ్య ప్రాజెక్ట్ లో లేనట్లేనని క్లారిటీ వస్తోంది. ప్రస్తుతం బాలయ్య `అఖండ2` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.