అనుష్క శెట్టి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా పాన్ ఇండియా హిట్ గా నిలిచిన బాహుబలి చిత్ర రీ రిలీజ్ కి రెడీ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో దేవసేనగా చేసిన అనుష్క శెట్టి పేరు ట్రెండ్ అవడం చూసి.. బాహుబలి సంగతి తర్వాత ముందు ఘాటీ రిలీజ్ తేదీ ఎప్పుడో చేప్పండి అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
నిజమే అనుష్క ఘాటీ చిత్రం ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ అన్నారు, ఆతర్వాత జులై 11 అన్నారు, ఇప్పుడేమో ఘాటీ సీజీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అందుకే విడుదల వాయిదా అంటూ ప్రెస్ నోట్ వదిలారు. అయితే ఆ వీఎఫెక్స్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో దర్శకుడు క్రిష్ కు క్లారిటీ లేదా.
అందుకే క్రిష్ ఘాటీ విడుదల తేదీ చెప్పలేకపోతున్నారేమో. విశ్వంభర లా ఘాటీ విడుదల తేది విషయంలో కూడా అభిమానులను వెయిటింగ్ లో పెట్టారు కదా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడం అనుష్క చెవిన, క్రిష్ చెవిన పడినా వారు ఘాటి విడుదల తేదీపై ఏదో ఒకటి ఆలోచిస్తారు. చూద్దాం ఘటికి మోక్షమెప్పుడో అనేది.!