ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ మొత్తం ఫినిష్ చేశాకే అంటే సెప్టెంబర్ నాటికి ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు షూటింగ్స్ ఫినిష్ చేసి స్పిరిట్ సెట్ లోకి అడుగు పెడతారా, సందీప్ వంగ పెట్టిన కండిషన్ ను ప్రభాస్ ఫాలో అవుతారా.. ప్రభాస్ సినిమా షూటింగ్స్ అనుకున్న సమయాల్లో పూర్తి కావు, మేకర్స్ పెట్టిన రిలీజ్ డేట్ కి సినిమాని రిలీజ్ చెయ్యలేరు.
రాజా సాబ్ షూటింగ్ ప్రభాస్ వల్లే లేట్ అనేది జగమెరిగిన సత్యం. అందుకే రాజా సాబ్ రిలీజ్ పోస్ట్ పోన్ లు. ఇక అదే సమయంలో ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ చేస్తున్నారు. రాజా సాబ్, ఫౌజీ రెండు షూటింగ్స్ ని బ్యాలెన్స్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ తో సెప్టెంబర్ లో సెట్ పైకి వెళ్లే సమయానికి ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ కంప్లీట్ చేస్తారో, లేదో అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.
సందీప్ వంగ స్పిరిట్ ని జూన్ నుంచే మొదలు పెట్టాలనుకుంటే ప్రభాస్ ఫ్రీ అవ్వని కారణంగా మళ్ళీ సెప్టెంబర్ అనుకున్నారు. ఒకవేళ ప్రభాస్ అప్పటికి రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ ఫినిష్ చెయ్యలేకపోతే ఆ స్పిరిట్ లాంచ్ డేట్ మళ్లీ మారుతుంది. సో ప్రభాస్ సినిమాల విడుదల వాయిదాలే కాదు ప్రభాస్ సినిమాలు మొదలవ్వడాలు ఇలా వాయిదా పడడం కామెడీగా తయారైంది. .
మరి రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చెయ్యడం ప్రభాస్ వల్ల అవుతుందా అనే న్యూస్ లు చూసాక ప్రభాస్ ఫాన్స్ ఆందోళనగా ఫీలవుతున్నారు.