మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనే విషయం పక్కనపెడితే ఆయన అనిల్ రావిపూడి తో చేస్తున్న Mega157 అప్ డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి హీరోయిన్ గా నయనతార సెట్ లోకి అడుగుపెట్టడం వరకు, అలాగే ప్రతిఒక్క Mega157 షెడ్యూల్ అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
జెట్ స్పీడు తో సాగుతున్న చిరు-అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. అయితే Mega157 టైటిల్ ఇప్పటికే ఫైనల్ కాగా.. దానిని టీజర్ తో పాటుగా అనౌన్స్ చెయ్యాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఆగష్టు 22 మెగాస్టార్ బర్త్ డే కి Mega157 టైటిల్ అండ్ టీజర్ కి ముహూర్తం పెట్టారని టాక్.
మరోపక్క Mega157 ఓటీటీ డీల్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అని, చిరు-అనిల్ రావిపూడి కాంబో Mega157 ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ గట్టిగా ట్రై చేస్తుందట. ఓ ఐదు కోట్ల దగ్గర బేరం ఆగింది అని.. 60 కోట్లకు ఈ డీల్ ఫైనలవుతుంది అంటున్నారు. మరి టీజర్ కూడా వదలకుండా ఈ రేంజ్ ధర Mega157 రావడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.