Advertisementt

సోషల్ మీడియాకి హీరోయిన్ బ్రేక్

Wed 09th Jul 2025 03:46 PM
shruti haasan  సోషల్ మీడియాకి హీరోయిన్ బ్రేక్
Shruti Haasan Quits Social Media సోషల్ మీడియాకి హీరోయిన్ బ్రేక్
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ అయినా, యాంకర్స్ అయినా, మరే ఇతర నటులైనా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ.. ఫాలోవర్స్ ని పెంచుకోవడమే కాదు సినిమా అవకాశాలను పట్టేస్తూ ఉంటారు. అదే సోషల్ మీడియా వల్ల చాలామంది నటులు ట్రోల్ కి గురైనవారు ఉన్నారు. సోషల్ మీడియా ఒక రకంగా మంచి చేస్తే మరొక రకంగా చెడు చేస్తుంది.

తాజాగా ఓ హీరోయిన్ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అది ఎవరో కాదు తన కెరీర్ విషయాలనే కాదు పర్సనల్ విషయాలను పబ్లిక్ గా సోషల్ మీడియాలో షేర్ చేసే శృతి హాసన్. తను కొద్దిరోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.

ఎప్పుడూ ధైర్యంగా ఉండే శృతి హాసన్ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆమె అభిమానులు ఆందోళపడుతుంటే శృతి హాసన్ మాత్రం కొద్దిరోజులపాటు ఎలాంటి హడావిడి లేకుండా సోషల్ మీడియాకి దూరంగా నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

మరి గ్లామర్ షో చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలే శృతి హాసన్ నుంచి కొన్నాళ్ల పాటు గ్లామర్ పిక్స్ ని ఆశించకూడదన్నమాట. 

Shruti Haasan Quits Social Media:

shruti hassan staying away from social media

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ