నందమూరి నటసింహా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ అరంగేట్రం పై నందమూరి ఫ్యాన్స్ లో ఉత్కంఠ, ఆసక్తి స్థానంలో అసహనం కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై వార్తలు రావడమే కానీ.. బాలయ్య అందుకు అనుగుణంగా అడుగులు వెయ్యడం లేదు. గత ఏడాది నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా పట్టాలెక్కకముందే అనౌన్సమెంట్ పోస్టర్ తోనే ఆగిపోయింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.. ఆ ప్రోజెక్టు ఆగిపోయింది. మోక్షజ్ఞ మాత్రం హీరో లుక్ లో నందమూరి అభిమానులను ఊరిస్తున్నాడు. హీరోగా చక్కటి ఫిజిక్, అద్భుతమైన లుక్ లోకి మారిన మోక్షజ్ఞ కటౌట్ వెండితెరపై చూసేందుకు అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.
మరి గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడాది గడుస్తున్నా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య ఇంకా డెసిషన్ తీసుకోకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. మరి మోక్షు ఎంట్రీ పై బాలయ్య స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది వారి కోరిక. చూద్దాం బాలయ్య ఆలోచన ఎలా ఉందొ అనేది.