Advertisementt

అస‌లైన యుద్దం ఉత్త‌రాంధ్రాలోనా

Wed 09th Jul 2025 01:19 PM
peddi  అస‌లైన యుద్దం ఉత్త‌రాంధ్రాలోనా
major part of Peddi will be shot in Uttarandhra అస‌లైన యుద్దం ఉత్త‌రాంధ్రాలోనా
Advertisement
Ads by CJ

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచనాల మ‌ధ్య పాన్ ఇండియాలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. కుస్తీ క్రీడ‌తో పాటు క‌థ‌లో మ‌రిన్ని క్రీడ‌లు హైలైట్ కానున్నాయి. అయితే ఈ సినిమా మూల క‌థ మాత్రం ఉత్త‌రాంధ్ర ఆధారంగా రాసుకున్న‌దే. అందుకే ఉత్త‌రాంధ్రా నుంచి బుచ్చిబాబు ప్ర‌త్యేకంగా కొంత మంది ఔత్సాహిక న‌టీన‌టుల్నీ కూడా స్టార్ హంట్ పేరిట తీసుకున్నాడు.

 

సినిమాల‌పై ఆస‌క్తి ఉన్న వారంతా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగంచేసుకోవాల్సింది కోరారు. ఈ క్ర‌మంలో చాలామంది ఉత్త‌రాంధ్రా నుంచి ఎంపి క‌య్యారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప్రాంతాల‌కు చెందిన వారు ఇందులో భాగ‌మ‌య్యారు.  ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి  ఇంత వ‌ర‌కూ ఉత్త‌రాంధ్రాలో ఎలాంటి షూటింగ్ జ‌ర‌గ‌లేదు. చిత్రీక‌ర‌ణ అంతా మైసూర్, హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. తొలి షెడ్యూల్ మైసూర్ లో మొద‌లైనప్ప‌టి నుంచి కంటున్యూగా హైద‌రాబాద్ లోనే  జ‌రుగుతోంది.

 

ఈ నేప‌థ్యంలో సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. సినిమాలో ప్ర‌ధాన భాగం షూటింగ్ అతా ఉత్త‌రాంధ్రాలోనే ఉంటుందిట‌. ఈ ప్రాంతం లోని వాస్త‌వ లొకేష‌న్ల‌లోనే చిత్రీక‌రించాల‌ని బుచ్చిబాబు భావిస్తున్నాడు. అవ‌స‌రం మేర ఉత్త‌రాంధ్రకు సంబంధించి కొన్ని సెట్లు రామోజీ ఫిలిం సిటీలో వేసి చేసినా?  కీల‌క‌మైన క్లైమాక్స్ స‌న్ని వేశాలు మాత్రం ఉత్త‌రాంద్ర‌లోని మారు మాల ప్రాంతాల్లో షూటింగ్ చేసేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారుట‌.

 

దీనిలో భాగంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం లోని కొన్ని ప్రాంతాల‌ను ఎంపిక చేస్తున్నారుట‌. ప్ర‌స్తుతం ఆ ప్రాంతాల‌కు సంబంధించి అన్వేష‌ణ సాగుతుంద‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ అనంత‌రం ఆయా  ప్రాంతాల్లో షూటింగ్ నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక సిద్ద‌మ‌వుతోందిట‌. ఆంధ్రా-ఒడిశా బోర్డ‌ర్ లో కూడా కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించే  అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్రచారంలో నిజ‌మెంతో మేక‌ర్స్ ధృవీక‌రిస్తే గానీ క్లారిటీ రాదు. 

major part of Peddi will be shot in Uttarandhra:

Peddi upcoming schedule details

Tags:   PEDDI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ