Advertisementt


మ‌క్క‌ల్ సెల్వ‌న్ తో పూరి మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలోనా

Wed 09th Jul 2025 11:03 AM
puri vijay sethupathi film  మ‌క్క‌ల్ సెల్వ‌న్ తో పూరి మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలోనా
Will Puri Change His path for vijay sethupathi film మ‌క్క‌ల్ సెల్వ‌న్ తో పూరి మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలోనా
Advertisement
Ads by CJ

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ `ఇస్మార్ట్ శంక‌ర్` తో బౌన్స్ బ్యాక్ అనంత‌రం సినిమాలు స్లో గా చేయాల‌ని డిసైడ్ అయిన సంగ‌తి తెలిసిందే. అభిమానులు..ఆయ‌న స‌తీమ‌ణి లావ‌ణ్య కూడా ఈ విష‌యంలో పూరిని రిక్వెస్ట్ చేసారు.  దీంతో పూరి కూడా వేగం త‌గ్గించారు.  ఈ క్ర‌మంలోనే  `లైగ‌ర్`, `డ‌బుల్ ఇస్మార్ట్` చిత్రా ల‌ను త‌న పాత ప‌ద్ద‌తి కి భిన్నంగా తెర‌కెక్కించారు. షూటింగ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కోసం ఎక్కువ స‌మ యం తీసుకుని చేసిన చిత్రాలివే. పూరి ఇంత వ‌ర‌కూ  ఏ సినిమా కోసం అంత స‌మ‌యం కేటాయించ‌లేదు.

 

అభిమానుల కోరిక మేరకు వేగాన్ని త‌గ్గించి కూల్ గా రిలీజ్ చేసిన చిత్రాల‌వి. కానీ ఫ‌లితాలు మాత్రం దారు ణంగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పూరి కెరీర్ లోనే `లైగ‌ర్`, `డ‌బుల్ ఇస్మార్ట్` చిత్రాలు గొప్ప డిజాస్ట‌ర్ల‌గా న‌మోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో పూరి కొత్త చిత్రాన్ని కొత్త ప‌ద్ద‌తిలో తెర‌కెక్కిస్తున్నాడా?  పాత ప‌ద్ద‌తిలో రూపొందిస్తున్నాడా? అంటే  న‌యా మేక‌ర్ పాత ప‌ద్ద‌తిలోకే వెళ్లిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇటీవ‌లే  హైద‌రాబాద్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. విజయ్ సేతు ప‌తి స‌హా ప్రధాన తారాగ‌ణమంతో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుంది. ఈ నేప‌థ్యంలో షూటింగ్ వేగంగా జ‌రుగుతుంద‌ని..పూరి పాత స్టైల్ మ‌ళ్లీ క‌నిపి స్తుంద‌ని సెట్స్ వ‌ర్గాల నుంచి తెలిసింది. ఇదే వేగంతో షూటింగ్ చేస్తే రెండు నెల‌ల్లోపే చిత్రీక‌ర‌ణ పూర్త‌వు తుందంటున్నారు. అటుపై మ‌రో నెల‌రోజుల‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్తి చేసే అవ‌కాశం ఉందిట‌. అదే జ‌రిగితే సినిమా ఆక్టోబ‌ర్...నవంబ‌ర్ లో రిలీజ్ కు వ‌చ్చేస్తుంది.

 

షూటింగ్ వేగంగా పూర్తి చేయ‌డంలో పూరి ఇండియాలోనే ఫాస్టెస్ట్ డైరెక్ట‌ర్ గా రికార్డు ఉంది. ఆయ‌న వేగాన్ని అందుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని రాజ‌మౌళి సైతం చాలా సంద‌ర్భాల్లో కీర్తించారు. తాను కూడా పూరి వ‌ద్ద ప‌నిచేసి ఆ టెక్నిక్ ప‌ట్టుకోవాల‌ని భావిస్తుంటారు. ఇలా పూరికి  టాలీవుడ్ లో ఓ ఇమేజ్ అంటూ ఉంది. కానీ ప‌రాజయాలే ఆ ఇమేజ్ ని దెబ్బ తీసాయి.  

Will Puri Change His path for vijay sethupathi film:

Puri  Starts Shoot for vijay sethupathi film

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ