Advertisementt


రాజ్ నిడిమోరుతో సామ్ అధికారిక‌మే

Wed 09th Jul 2025 10:38 AM
samantha  రాజ్ నిడిమోరుతో సామ్ అధికారిక‌మే
Its official samantha in relationship రాజ్ నిడిమోరుతో సామ్ అధికారిక‌మే
Advertisement
Ads by CJ

స‌మంత రూత్ ప్రభు కొత్త ల‌వ్ లైఫ్- రిలేష‌న్ షిప్ స్టాట‌స్ గురించి తెలుసుకోవాల‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. చైతూ నుంచి విడిపోయిన త‌ర్వాత స‌మంత ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్ హ‌ని బ‌న్ని లాంటి వెబ్ సిరీస్ ల‌కు ఈ జంట క‌లిసి ప‌ని చేసారు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింద‌ని వెబ్ లో క‌థ‌నాలొచ్చాయి.

 

చాలా ఈవెంట్ల‌లో రాజ్ నిడిమోరుతో స‌మంత ఎంతో స్నేహంగా, స‌న్నిహితంగా క‌నిపించిన ఫోటోలు ఈ పుకార్ల‌కు ఆజ్యం పోసాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంది? అస‌లు ఏం జ‌రుగుతోంది? అంటూ చాలా మీడియాలు క‌థ‌నాలు అల్లాయి. అయితే ఈ జంట ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ రిలేష‌న్ గురించి కానీ డేటింగ్ గురించి కానీ వెల్ల‌డించ‌లేదు.

 

మ‌రోవైపు రాజ్ నిడిమోరు మాజీ భార్య సోష‌ల్ మీడియాల్లో నిగూఢ పోస్టులు బ‌య‌ట‌ప‌డ్డాక‌, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రిలేష‌న్ ఉంద‌ని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మంత త‌న స్నేహితుడు రాజ్ నిడిమోరుతో అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. ఇటీవల మిచిగాన్‌లోని డెట్రాయిట్ లో ప‌ర్య‌టించిన సామ్ అత‌డితో క‌లిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2025 కార్యక్రమానికి హాజరైన క్ర‌మంలో సామ్ తో రాజ్ చేయి చేయి క‌లిపి క‌నిపించారు. అలాగే స‌మంత‌ భుజాలను చుట్టేస్తూ త‌న చేతిని ప్రేమ‌కు చిహ్నంగా ఉంచాడు. ఆ ఇద్ద‌రూ చిరునవ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్నారు. డెట్రాయిట్ వీధుల సాక్షిగా ఇప్పుడు దీనిని అధికారికం చేసారు! అంటూ జోరుగా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. సమంత - రాజ్ కెమిస్ట్రీ మిస్ అవ్వడం కష్టం అని కూడా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రెస్టారెంట్ లో సామ్ - రాజ్ జంట‌తో పాటు, వారి స్నేహితులు క‌లిసి విందును ఆస్వాధిస్తున్న ఫోటోల‌ను కూడా స‌మంత షేర్ చేసింది. అయితే రాజ్ తో త‌న సంబంధం ఎలాంటిది? అనేది స‌మంత స్వ‌యంగా ధృవీక‌రించాల్సి ఉంది.

 

రాజ్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేసి డెట్రాయిట్ లో ఉన్నామని స‌మంత త‌న ప‌ర్య‌ట‌న గురించి రివీల్ చేయ‌గానే,  ఆన్‌లైన్‌లో ప్రతిస్పంద‌న మొద‌లైంది. ఒక అభిమాని, ``సో బేబీయ్ ఇది అధికారికమా?? నేను మీ విష‌యంలో చాలా సంతోషంగా ఉన్నాను సామ్`` అని వ్యాఖ్యానించగా, మరొకరు ``చివరకు మీ ప్రేమను కనుగొన్నారు.. సంతోషం`` అని రాశారు. స‌మంత ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ర‌క్త్ బ్ర‌హ్మాండ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Its official samantha in relationship:

Is samantha making her relationship with Raj Nidimoru official

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ