పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఇప్పటివరకు ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ అని ఒకసారి, కాదు దీపికా పదుకొనె హీరోయిన్ అని ఒకసారి ప్రచారం జరగడం, ఈలోపు దీపికా ని స్పిరిట్ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతున్న సమయంలో యానిమల్ ఫేం త్రుప్తి డిమ్రీ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
యానిమల్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రుప్తి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో మళ్లీ పనిచేయడం పట్ల, అలాగే ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ను తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది పాన్ వరల్డ్ విజన్ ని తెలియజేస్తోంది.