Advertisementt

రామ్ చరణ్ పెద్ది వర్కింగ్ స్టిల్స్

Thu 22nd May 2025 04:26 PM
ram charan  రామ్ చరణ్ పెద్ది వర్కింగ్ స్టిల్స్
PEDDI Lengthy and Crucial Schedule Begins రామ్ చరణ్ పెద్ది వర్కింగ్ స్టిల్స్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో పెద్ది భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. తాజాగా పెద్ది, లెన్తీ క్రూషియల్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో ప్రారంభమౌతోంది.

పెద్ది లోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్, మూలకథను ప్రతిబింబించేలా, ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీం అద్భుతమైన వర్క్ చేస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో మ్యాసీవ్ విలేజ్ సెట్ ని నిర్మించారు. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్, టాకీ పోర్షన్ ని చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్ ద్వారా సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రస్టిక్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. దర్శకుడు బుచ్చిబాబు పెద్ది వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

PEDDI Lengthy and Crucial Schedule Begins :

Ram Charan PEDDI Lengthy and Crucial Schedule Begins In A Gigantic Village Set In Hyderabad

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ