ప్రేమ గుడ్డిది. అసలు దీనికి వయసు అడ్డు కాదు. సచిన్ టెండూల్కర్- అంజలి టెండూల్కర్, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ, అఖిల్ - జైనాబ్ రావూజీ ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వయసు వ్యత్సాసం ఉన్నా వీరంతా ఆదర్శ జంటలుగా అభిమానులను ఆకర్షిస్తూనే ఉన్నారు. సచిన్, కోహ్లీ, అఖిల్ కంటే భార్యల వయసు ఎక్కువ. కానీ వారి అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శం.
ఇప్పుడు శ్రద్ధా కపూర్ తన కంటే మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో ఉంది. అతడి పేరు రాహుల్ మోడీ. ఇతడు బాలీవుడ్ లో ప్రముఖ రచయిత. ప్యార్ కా పంచ్‌నామా 2 (2015), సోను కే టిటు కి స్వీటీ (2018) , తు జీతూ మై మక్కర్ (2023) చిత్రాలతో రచయితగా బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. తూ జీతూ చిత్రంలో శ్రద్ధా కథానాయికగా నటించింది. ఆ సినిమా సమయంలోనే రచయిత మోడీతో ప్రేమ చిగురించిందని కథనాలొచ్చాయి. ఈ అందమైన జంట డేటింగ్ సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇంకా వారు డేటింగ్ ని కన్ఫామ్ చేయలేదు. స్త్రీ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత శ్రద్ధా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకుని జోరు మీదున్న శ్రద్ధా తన వ్యక్తిగత లవ్ లైఫ్ లోను ఆనందంగా ఉంది.