క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మోడల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సారా తన అందం, పబ్లిక్ అప్పియరెన్స్‌తో యూత్ లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇన్ స్టాలో సారా నిరంతర ఫోటోషూట్లు ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు సారా టెండూల్కర్ - శుభ్ మాన్ గిల్ డేటింగ్ వ్యవహారంపైనా చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవలే ఈ జంట విడిపోయారని కూడా కథనాలు రావడం ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు సారా టెండూల్కర్ పాపులర్ బాలీవుడ్ నటుడు, `గల్లీబోయ్` ఫేం సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట ఒకరినొకరు రహస్యంగా కలుసుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కానీ ఇంకా స్నేహం ఆరంభ దశలోనే ఉంది. అయినా వారి మధ్య సాన్నిహిత్యం పరిసరాలను ఆకర్షిస్తోందని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. ఆ మేరకు నేషనల్ మీడియా కథనాలు వేడి పెంచుతున్నాయి.
అయితే సిద్ధాంత్ తో సారా టెండూల్కర్ డేటింగ్ కి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆ ఇద్దరూ కలిసి బహిరంగంగా కూడా కనిపించలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. మరోవైపు సారా టెండూల్కర్ నుంచి విడిపోయాడని ప్రచారంలో ఉన్న క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నటి అవ్ నీత్ కౌర్ తో ప్రేమలో ఉన్నాడని మరో పుకార్ షికార్ చేస్తోంది. దీనిపైనా ఇంకా ఎలాంటి క్లూ బయటికి రాలేదు.