Advertisementt

హిట్ అయినా శ్రీనిధి పేరు వినిపించలేదేమిటో

Sun 04th May 2025 11:41 AM
srinidhi shetty  హిట్ అయినా శ్రీనిధి పేరు వినిపించలేదేమిటో
why srinidhi shetty not getting offers హిట్ అయినా శ్రీనిధి పేరు వినిపించలేదేమిటో
Advertisement
Ads by CJ

KGF ఫ్రాంచైజీ సక్సెస్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి పేరు మోగిపోతుంది, పాన్ ఇండియా హీరోల సినిమాల్లో అమ్మడుకు వరస అవకాశాలు వస్తాయని ఆమె అభిమానులే కాదు శ్రీనిధి కూడా ఎదురు చూసే ఉంటుంది. కానీ శ్రీనిది శెట్టి మాత్రం KGF తర్వాత అంతగా కనిపించలేదు. తమిళనాట అడుగుపెట్టినా అది సక్సెస్ అవ్వలేదు.

ఇన్నాళ్లకు తెలుగులోకి హిట్ 3 తో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో నటించిన మొదటి ఫిలిం తోనే శ్రీనిధి శెట్టి హిట్ కొట్టింది. హిట్ 3 చిత్రం మే 1 న విడుదలై సూపర్ హిట్ టాక్ మాత్రమేనా సూపర్ కలెక్షన్స్ తో హీరో నాని కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్స్ తోనే హిట్ 3 నాని కెరీర్ లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.

హిట్ 3 లో నాని పేరు మోగిపోతుంది. హిట్ 3 కి కారణం నాని, నాని నానినే, ఎక్కడా శ్రీనిధి శెట్టి పేరు మాత్రం వినిపించడం లేదు. శ్రీనిధి శెట్టి హిట్ లో చిన్న పాత్రకు పరిమితం కాలేదు. ఫస్ట్ హాఫ్ లో అలా అలా కనిపించినా, సెకండ్ హాఫ్ లో శ్రీనిధి బాగానే కనిపించింది. కానీ హిట్ 3 సక్సెస్ లో మాత్రం శ్రీనిధి పేరు వినిపించలేదు.

మరి హిట్ 3 తర్వాత శ్రీనిధి కి సౌత్ అవకాశాలు ఎలా ఉంటాయో, ఏ యువ హీరో ఈ హిట్ హీరోయిన్ శ్రీనిధి అవకాశం ఇస్తాడో వేచి చూడాల్సిందే. 

why srinidhi shetty not getting offers:

Inspite of success why srinidhi shetty not getting offers

Tags:   SRINIDHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ