NKR21 నుంచి కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్

నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 మేకర్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్‌ను లాంచ్ చేయడంతో స్పెషల్ ట్రీట్‌ను అందించారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి ఫైర్ తో, కుర్చీపై కూర్చున్న కళ్యాణ్ రామ్ తన చుట్టూ గూండాలని ఇంటెన్స్ గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తోంది. స్టైలిష్ మేకోవర్ అయిన కళ్యాణ్ రామ్ వెరీ వైలెంట్ గా కనిపిస్తున్నారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న #NKR21 చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేయనున్నారు. నందమూరి హీరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా డైనమిక్ క్యారెక్టర్‌ని పోషిస్తోన్నారు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.
Kalyan Ram Looks Ferocious In Birthday Special Poster From NKR21
Nandamuri Kalyan Ram Looks Ferocious








































