Advertisementt

అరెరే కుదురే లేదే: డై హార్డ్‌ ఫ్యాన్‌

Mon 01st Aug 2022 09:39 AM
die hard fan,die hard fan movie,die hard fan song launch  అరెరే కుదురే లేదే: డై హార్డ్‌ ఫ్యాన్‌
Die Hard Fan song release అరెరే కుదురే లేదే: డై హార్డ్‌ ఫ్యాన్‌
Advertisement
Ads by CJ

శివ ఆల‌పాటి, ప్రియాంక శ‌ర్మ‌ జంట‌గా నటిస్తున్న చిత్రం డై హార్డ్‌ ఫ్యాన్‌. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్‌ డైరెక్టర్‌ అభిరామ్ ఎం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాగా ఈ చిత్రాన్ని శ్రీహన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ లో  చంద్రప్రియ 

సుబుద్ధి నిర్మిస్తున్నారు. స్టార్ హీరోస్ కి మాత్రమే కాకుండా హీరోయిన్స్ కి కూడా అభిమానులు ఉంటారు.సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం.

ఈ చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి అరెరే కుదురే లేదే అనే పాటను విడుదల చేసింది మూవీ టీం. హరిచరణ్ ఈ పాటను ఆలపించగా, లక్ష్మి ప్రియాంక సాహిత్యం అందించారు. 

అరెరే కుదురే లేదే .. కరిగే కాలానికే

నిన్నే చూస్తూ ఇలా ... క్షణమే చేజారిందే

తారే నేరుగా ... జారిందిలా నేలకే... నాకోసమే

అనే లైన్స్ ఆకట్టుకున్నాయి.! 

హరిచరణ్ ఆలపాన వినసొంపుగా ఉంది.

ఈ చిత్రంలో షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, నోయల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆగస్టులో డై హార్డ్‌ ఫ్యాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Die Hard Fan song release:

Die Hard Fan movie update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ