Advertisement

NTR30 ఓపెనింగ్ డేట్ పై క్లారిటీ

Mon 01st Aug 2022 09:47 AM
ntr 30,koratala siva,ntr,koratala-ntr combo  NTR30 ఓపెనింగ్ డేట్ పై క్లారిటీ
Crazy update on NTR 30 NTR30 ఓపెనింగ్ డేట్ పై క్లారిటీ
Advertisement

ఎన్టీఆర్-కొరటాల కాంబో మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 30 పై కొరటాల కానీ, ఎన్టీఆర్ కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఫాన్స్ పదే పదే డిస్పాయింట్ అవుతున్నారు. జూన్ నుండే రెగ్యులర్ షూట్ అన్నారు కానీ, ఆగష్టు నెల వచ్చేసినా టీం కామ్ గా ఉండేసరికి ఫాన్స్ లో అనుమానాలు, ఆందోళన పెరిగిపోతుంది. ఒకపక్క అసలు ఈ సినిమా ఉంటుందా.. ఉండదా అనే అనుమానము స్టార్ట్ అవుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల ఎన్టీఆర్ 30 కి కావాల్సిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి చేసారని, ఈ సినిమా కోసం జూబ్లీహిల్స్ లో ఓ కాస్ట్లీ సెట్ వేయించారని, మొదటి షెడ్యూల్ ఆ సెట్ లోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు మొదలు పెట్టారని.. ఆగష్టు 26 న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోతారని, వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. 

Crazy update on NTR 30 :

NTR 30 new update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement