మేనల్లుడి కోసం నాగ్ వస్తున్నాడు
Nagarjuna chief guest at Kapatadhaari Pre release eventసుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు సుమంత్ లేటెస్ట్ మూవీ కపటధారి. డిఫరెంట్ కథా చిత్రాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమంత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న కపటధారి చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. రీసెంట్‌గా సమంత అక్కినేని విడుదల చేసిన ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై క్రియేట్ అయిన అంచనాలను మరింత పెంచేలా ఫిబ్రవరి 16న జరగబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
కన్నడ చిత్రం కావలుధారి సినిమాకు ఇది తెలుగు రీమేక్. రీసెంట్‌గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తెలుగులో సందడి చేయడానికి కపటధారిగా ముందుకు రానుంది. ఓ ట్రాఫిక్ ఇన్సెపెక్టర్ ఓ హత్య కేసును ఎలా చేధించాడు అనే కథాంశంతో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీంతో సుమంత్ పాత్రను ఎలా క్యారీ చేశారోనని ఆసక్తితో అందరిలో ఏర్పడింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
Nagarjuna chief guest at Kapatadhaari Pre release event







































