Advertisement

విజేత సెన్సార్ వివరాలివే..!

Sat 07th Jul 2018 01:39 AM
chiranjeevi,kalyan dhev,vijetha,censor,complete  విజేత సెన్సార్ వివరాలివే..!
Vijetha Censor Completed విజేత సెన్సార్ వివరాలివే..!
Advertisement

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. 

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు: కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి, నిర్మాత: రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్, ప్రెజెంటర్: సాయి శివాని, కెమెరామెన్: కె.కె.సెంథిల్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సాహిత్యం: రెహమాన్ రామజోగయ్య శాస్త్రి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, స్టంట్స్: జాషువ, పీ. ఆర్.ఓ: వంశీశేఖర్.

Vijetha Censor Completed:

Kalyaan Dhev’s Vijetha Completes Censor formalities  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement