Advertisementt

Ads by CJ

థ్రిల్లర్ సబ్జెక్టుతో 'చారుశీల'!

Thu 14th Apr 2016 01:38 PM
charuseela,sagar,rajeev kanakala,srinivas reddy  థ్రిల్లర్ సబ్జెక్టుతో 'చారుశీల'!
థ్రిల్లర్ సబ్జెక్టుతో 'చారుశీల'!
Advertisement
Ads by CJ

రేష్మి, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. ఈ సినిమా లోగోను భీమనేని శ్రీనివాసరావు, ఫస్ట్ లుక్ ను జి.నాగేశ్వరరెడ్డి, ఎ.ఎస్.రవికుమార్ చౌదరిలు బుధవారం హైదరాబాద్ లో ఫిలిం చాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..         

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో సాగర్ గారు నిర్మాతగా మారుతున్నారు. మంచి సినిమా తీశారు. లోగో చాలా స్టైలిష్ గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''సాగర్ గారు కోట్లు సంపాదించే శిష్యులను ఇండస్ట్రీకు అందించారు. ఈ సినిమాతో ఆయన కోట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఆయన తమ్ముడ్ని దర్శకుడిగా.. తమ్ముడు తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నారు'' అని చెప్పారు.

రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ.. ''నేను, శ్రీనువైట్ల, వి.వి.వినాయక్ సాగర్ గారి శిష్యులం. వంద సినిమాలు చేసిన సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ వుయ్యూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. ''ఇదొక థ్రిల్లర్ సబ్జెక్ట్. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత సినిమా చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పిన వెంటనే సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల అద్బుతంగా నటించాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం''  అని అన్నారు. 

బెనర్జీ, మెల్కోటే, రాకెట్ రాఘవ, గెటప్ శీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపు, ఎడిటింగ్ : వి.నాగిరెడ్డి, సంగీతం : సుమన్ జూపూడి, ఆర్ట్ : బాబ్జీ, నిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ