తారకరత్న హీరోగా శేఖర్, యామిని, చందు ప్రధాన పాత్రల్లో ముప్ప క్రాంతి చిత్ర పతాకంపై వెంకట రమణ సల్వ దర్శకత్వంలో ముప్ప అంకమ్మ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎవరు'. ఈ సినిమా టీజర్ ను గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో చిత్రయూనిట్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
దర్శకుడు వెంకటరమణ సల్వ మాట్లాడుతూ....మిస్టరీ, డ్రామా ఉన్న సినిమా. హారర్ ఎలిమెంట్స్ జోడించి తీశాం. తారక రత్న ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. తనొక జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రెండు, మూడు కథలతో నడిచే సినిమా. ప్రేక్షకుల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో.. అనే క్యూరియాసిటీ కలుగుతుంది.. అని చెప్పారు.
హీరో తారకరత్న మాట్లాడుతూ....మంచి స్క్రిప్ట్. ఇప్పటివరకు ఈ తరహా కథ రాలేదు. సినిమాలో హీరో, హీరోయిన్ అని కాకుండా ప్రతి క్యారెక్టర్ లీడ్ రోలే. సినిమా బాగా రావాలని అందరం కలిసి పని చేశాం. సినిమాలో నటించిన ఆర్టిస్ట్స్ అందరికి మైల్డ్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది.. అని చెప్పారు.
నిర్మాత అంకమ్మ చౌదరి మాట్లాడుతూ....సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మా సంస్థ నుండి మంచి సినిమాలు రావాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోనే సినిమా కథ ఇమిడి ఉంటుంది. ఈ సినిమాలో తారక్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలుస్తుంది.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కారుమంచి, ప్రసన్న కుమార్, యోగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వర శర్మ, కో ప్రొడ్యూసర్: లింగ శ్రీనివాసరావు, కోరియోగ్రఫీ: శ్రీధర్ రెడ్డి యర్వ, ప్రొడ్యూసర్: ముప్ప అంకమ్మ చౌదరి, కథ-దర్శకత్వం-సినిమాటోగ్రఫీ: వెంకటరమణ సల్వ.