Advertisement

రామ్ చరణ్ మూవీ ప్రారంభమైంది!

Thu 18th Feb 2016 06:23 PM
  రామ్ చరణ్ మూవీ ప్రారంభమైంది!
రామ్ చరణ్ మూవీ ప్రారంభమైంది!
Advertisement

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, , స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పదో చిత్ర ప్రారంభోత్సవం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ప్రాంగణంలో ఈరోజు లాంఛనంగా జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఈ రోజు(ఫిబ్రవరి 18) లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి జరగనుంది. 

నటీనటులు

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు

సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement