Advertisementt

షారుఖ్‌పై పగతీర్చుకున్న దర్శకుడు!

Tue 29th Dec 2015 02:04 PM
sanjay bhansali,shahrukh khan,dilwale movie,bhajirao masthani  షారుఖ్‌పై పగతీర్చుకున్న దర్శకుడు!
షారుఖ్‌పై పగతీర్చుకున్న దర్శకుడు!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌ షారుఖ్‌ఖాన్‌పై ఎనిమిదేళ్ల నాటి పగ తీర్చుకున్నాడు సంజయ్‌లీలా భన్సాలి. ఆనాడు ఒకే రోజున షారుఖ్‌ నటించిన 'ఓం శాంతి ఓం', సంజయ్‌లీలా భన్సాలీ 'సావరియా' చిత్రాలు విడుదలయ్యాయి. వాస్తవానికి అప్పుడు సంజయ్‌లీలాభన్సాలీ 'సావరియా' రిలీజ్‌ డేట్‌ను ముందుగానే అనౌన్స్‌ చేసినప్పటికీ షారుఖ్‌ అదే పనిగా అదే రోజున తన 'ఓం శాంతి ఓం' రిలీజ్‌ చేశాడు. ఆ బాక్సాఫీస్‌ పోరులో సంజయ్‌లీలా బన్సాలీ చిత్రం 'సావరియా' అట్టర్‌ఫ్లాప్‌ కాగా, 'ఓం శాంతి ఓం' సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆనాటి పగను గుర్తుపెట్టుకున్న సంజయ్‌లీలా భన్సాలీ ఇప్పుడు పనిగట్టుకొని షారుఖ్‌ 'దిల్‌వాలే'కు పోటీగా తన 'బాజీరావ్‌మస్తానీ' చిత్రాన్ని విడుదల చేశాడు. సాధారణంగా మూడు రోజుల్లోనే 100కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించే షారుఖ్‌ 'దిల్‌వాలే' విషయంలో ముక్కిమూలుగుతున్నాడు. అదే సమయంలో 'బాజీరావు మస్తానీ' చిత్రం కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతుంటే 'దిల్‌వాలే' చిత్రం కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. సో.. మొత్తానికి సంజయ్‌ పగ తీరిందని బాలీవుడ్‌ వర్గాలు, షార్‌ఖ్‌ వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ