Advertisement

కేటుగాడు ప్లాటినం డిస్క్ వేడుక!

Wed 16th Sep 2015 05:16 AM
ketugadu,kittu,venkatesh balasani,tejas,chandini chowdary  కేటుగాడు ప్లాటినం డిస్క్ వేడుక!
కేటుగాడు ప్లాటినం డిస్క్ వేడుక!
Advertisement

తేజస్‌, చాందిని జంటగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కేటుగాడు. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను మంగళవారం హైదరాబాద్ లోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.ఎస్.రామారావు ప్లాటినం డిస్క్ లను చిత్ర యూనిట్ కు అందజేశారు. ఈ సందర్భంగా..

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో డైరెక్టర్ కిట్టు ఈ చిత్రాన్ని బాగా తీసారు. పాటలు బావున్నాయి. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తేజస్ చాలా ఎనర్జీటిక్ గా నటించాడు. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు. 

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. కిట్టు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వెంకటేష్ గారు చిత్రానికి బ్యాక్ బోన్. ఈ సినిమాలో చాందిని, తేజస్ తో పోటీ పడి నటించింది. కేటుగాడు లో నేను భాగం అవ్వడం ఆనందంగా ఉంది.. అని చెప్పారు.  

సంగీత దర్శకుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. డైరెక్టర్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా తీయడానికి ప్రయత్నించాడు. తేజకు ఈ సినిమాతో మంచి కమర్షియల్ హీరో అనే ఇమేజ్ వస్తుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

డైరెక్టర్ కిట్టు మాట్లాడుతూ.. ఈ కథ చెప్పగానే దాన్ని నమ్మి సినిమా తియ్యడానికి ముందుకొచ్చిన నిర్మాతలు వెంకటేష్‌గారికి, వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి థాంక్స్‌. ఒక మంచి సినిమా చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.. అని అన్నారు.

నిర్మాత వెంకటేష్ బాలసాని మాట్లాడుతూ.. సినిమా క్వాలిటీ పరంగా కంటెంట్ పరంగా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

హీరో తేజస్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చాందిని చౌదరి, జ్వాలా చక్రవర్తి, సాయి రాజ్, వెంకటేశ్వరావు, రాజు, మని, సంపత్, గణేష్, ఆనంద్, ఫణి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి, పాటలు: శ్రీమణి, కాసర్ల శ్యామ్‌, భాషాశ్రీ, బాలాజీ, బి.సుబ్బరాయశర్మ, మాటలు: పి.రాజశేఖరరెడ్డి, ఎడిటింగ్‌: పి.వెంకటేశ్వరరావు, భాషాశ్రీ, ఫైట్స్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు ఎం., సంపత్‌కుమార్‌ ఎ., సమర్పణ: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement