Advertisementt

మెగాఇమేజ్‌ వద్దంటున్న మెగాహీరో..!

Wed 16th Sep 2015 05:11 AM
sai dharam tej,mega image,maga family,megastar  మెగాఇమేజ్‌ వద్దంటున్న మెగాహీరో..!
మెగాఇమేజ్‌ వద్దంటున్న మెగాహీరో..!
Advertisement
Ads by CJ

మెగా ఇమేజ్‌.. దీనికి ఉన్న పవర్‌ ఏమిటో? సత్తా ఏమిటో? కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇమేజ్‌ ఉంటే చాలు.. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా ఈజీ. కొత్త హీరో అయినా ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. మెగాఫ్యామిలీ నుండి పరిచయం అయ్యే హీరోలందరికీ ఇది వర్తిస్తుంది. అయితే మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ మాత్రం తనకు ఈ మెగా ఇమేజ్‌ వద్దంటున్నాడు. మెగాఫ్యామిలీకి ఉన్న ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని తాను పైకి రావాలనుకోవడం లేదని, సొంత గుర్తింపు తెచ్చుకుంటానని అంటున్నాడు. మెగాఫ్యామిలీకి చెందిన వాడిని కావడం వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయనేది వాస్తవమే అయినా తన పనిని బట్టే ప్రేక్షకులు ఆదరిస్తారని, నటన విషయంలో న్యాయనిర్ణేతలు ప్రేక్షకులే అంటున్నాడు. మరి రాబోయే కాలంలో సాయిధరమ్‌తేజ్‌ మెగా అండ లేకుండా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో వేచిచూడాల్సివుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ