Advertisement

'తిక్క' మూవీ ప్రారంభం!

Fri 31st Jul 2015 01:46 PM
thikka movie opening,sai dharam tej,suneel reddy,rohan kumar reddy  'తిక్క' మూవీ ప్రారంభం!
'తిక్క' మూవీ ప్రారంభం!
Advertisement

సాయి ధరమ్ తేజ్, లారిస్సా బోనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్ పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా తెలంగాణా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా.. 

మహేందర్ రెడ్డి మాట్లాడుతూ "రెండు హిట్ సినిమాలలో నటించి సక్సెస్ పదంలో దూసుకెళ్తున్న హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మరొక చిత్రమిది. అన్ని జిల్లాలలోను ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ "దర్శక నిర్మాతలు ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వారి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలానే ఈ చిత్రంతో టీం అందరికి మంచి పేరు వస్తుంది" అని చెప్పారు.

హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ "ఇది నా నాలుగవ చిత్రం. చాలా సంతోషంగా ఉంది. 2014 జూలై లో ఈ సినిమా కథ విన్నాను. కొత్తగా అనిపించింది. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవ్వడంతో హీరోకు తిక్క రేగుతుంది. అందుకే సినిమాకు 'తిక్క' అనే టైటిల్ పెట్టారు. తన ప్రేమను మరల తిరిగి ఎలా సాధించాడు అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి" అని చెప్పారు.

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ "ఎవరి జీవితానికి వాడే హీరో. కాని ఈ సినిమాలో హీరో లైఫ్ కు తనే విలన్. ఇదొక హిలారియాస్ కామెడీతో కూడిన ఫన్ ఫిలిం. ఆగస్ట్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసి, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

నిర్మాత సి.రోహన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ లారిస్సా బోనేసి, టి.డి.పి తెలంగాణా అధ్యక్షులు ఎల్.రమణ, హీరో సునీల్, నవీన్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్.తమన్,  ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కథ: షేక్ దావూద్, డైలాగ్స్: లక్ష్మి భూపాల్, ప్రొడ్యూసర్: సి.రోహన్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement