Advertisement

‘సినిమా చూపిస్త మావ’ ఆడియో లాంచ్..!

Tue 07th Jul 2015 04:57 AM
cinema chupistha mava,raj tarun,avika gour,trinadharao,bekkam venugopal  ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో లాంచ్..!
‘సినిమా చూపిస్త మావ’ ఆడియో లాంచ్..!
Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'.. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, శ్రీనువైట్ల, శ్రీమతి శ్యామల బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కృష్ణంరాజు ఆవిష్కరించి తొలి ప్రతిమను శ్రీనువైట్లకి అందజేశారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా..

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘శేఖర్‌ చంద్ర మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇందులో మూడు, నాలుగు పాటలు నాకు బాగా నచ్చాయి. నేనొక సినిమా చేస్తే శేఖర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సినిమా హిట్ అవ్వడానికి మ్యూజిక్ చాలా దోహద పడుతుంది. రాజ్‌తరుణ్‌, అవికాగోర్‌ నటించిన ఉయ్యాలా జంపాలా పెద్ద సక్సెస్ ను సాధించింది. మరలా అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి.  ట్రైలర్‌ చక్కగా ఉంది. త్రినాథరావు సినిమాని బాగా డైరెక్ట్‌ చేశాడని విన్నాను. నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి. గొప్ప ప్రొడ్యూసర్స్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘‘ఉయ్యాలా జంపాలా చిత్రం నాకు చాలా నచ్చింది. ఆ సినిమాలో రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ జెన్యూన్ గా అనిపించింది. శేఖర్ ప్రతి సినిమాకు మ్యూజిక్ బాగా చేస్తాడు. ఈ ఆల్బమ్ కూడా బావుంది. టీమ్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

సునీల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పోస్టర్‌ చూస్తుంటే మనకి ఎలాంటి సినిమా చూపిస్తున్నాడో తెలుస్తుంది. నిర్మాతకు సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి. రాజ్‌తరుణ్‌, అవికా మంచి హిట్‌ జోడిగా మరోసారి మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. 

సందీప్ కిషన్ మాట్లాడుతూ "మంచి టీం. మంచి టైటిల్. రాజ్ తరుణ్ నాకు బ్రదర్ లాంటివాడు. ఉయ్యాలా జంపాలా హిట్ పెయిర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలి" అని చెప్పారు.

సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిర్మాత అంజిరెడ్డి 1999లో దేవి సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌స్టార్‌ చేసి ఆ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని హిట్‌ వరకు నడిపించిన వ్యక్తి. ఆయన లేకుంటే ఎం.ఎస్‌.రాజుగారు లేరు. దేవిశ్రీప్రసాద్‌ లేడు. ఆయనకి వేణుగోపాల్‌ అనే కమిట్‌మెంట్‌ ఉన్న నిర్మాత దొరకడం మంచి విషయం. మంచి హిట్‌ జోడి. అన్నీ మంచి విషయాతో వస్తున్న సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అన్నారు. 

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘నటీనటులు, మంచి కథ అన్నీ పక్కాగా కుదిరాయి. ఈ టైటిల్‌ పెడుతున్నప్పుడే చాలా భయపడ్డాను. అందుకే చాలా జాగ్రత్తగా చేశాను. మంచి ఎనర్జిటిక్‌ టైటిల్‌ ఇది. రాజ్‌తరుణ్‌లో కొత్త ఎనర్జినీ చూశాను. అవికా ఈ సినిమాకి నైటింగేల్‌. శేఖర్‌ చంద్ర మంచి మ్యూజిక్‌ అందించాడు. తప్పకుండా అందరికీ నచ్చే కమర్షియల్‌ ఎంటైనర్‌ అవుతుంది’’ అన్నారు. 

బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు శేఖర్ మంచి మ్యూజిక్ అందించాడు. నా తోటి నిర్మాతలు ఎంతగానో సహకరించారు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమా సహాయపడిన అందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు. 

శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ ‘‘మేము వయసుకు వచ్చాం సినిమా తరువాత త్రినాధ్ గారు ఈ సినిమాతో మరో అవకాశం ఇచ్చారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలి’’ అన్నారు. 

రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ‘‘ఉయ్యాల జంపాల సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాను. ప్రసన్న, డైరెక్టర్ స్టొరీ చెప్పగానే కథ నచ్చి ఒప్పుకున్నాను. ఇదొక మంచి మాస్ ఎలిమెంట్స్ తో కూడిన లవ్ స్టొరీ.  మేం వయసుకి వచ్చాం సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. త్రినాథరావు ఈ సినిమా ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్స్ అందరు బాగా ప్రోత్సహించారు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అవికా గోర్‌, కోనవెంకట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మల్కాపురం శివకుమార్‌, ప్రవీణ్‌ సత్తార్‌, అంజిరెడ్డి, తుమ్మపల్లి రామసత్యనారాయణ, దశరథ్‌, రాజ్‌కందుకూరి, నిర్మాత శ్రీధర్‌రెడ్డి, నిర్మాత రాజ్‌కుమార్‌, నిర్మాత ఆసూ నీలాని, అమ్మిరాజు, సుధాకర్‌ కోమాకుల, గోపిమోహన్‌ తదితయి పాల్గొన్నారు. 

 

 

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement