Advertisementt

'కేరింత' సక్సెస్ మీట్..!

Mon 22nd Jun 2015 11:25 AM
kerintha,dil raju,saikiran adavi,sumanth aswin  'కేరింత' సక్సెస్ మీట్..!
'కేరింత' సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా 'కేరింత'. జూన్ 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా.. 

దిల్ రాజు మాట్లాడుతూ "సినిమా విడుదలయిన రోజు మిశ్రమ స్పందన రావడంతో కాస్త బాధపడ్డాను. కాని కేవలం మౌత్ టాక్ తో 'కేరింత' సక్సెస్ ఫుల్ గా రెండవవారంలోకి అడుగుపెట్టింది. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేసారు. ముఖ్యంగా నూకరాజు అనే పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మొదటివారంలో సినిమా కలెక్షన్స్ డల్ గా ఉన్నా ప్రస్తుతం మాత్రం అన్ని ఏరియాలలో ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. వైజాగ్ లో మూడు థియేటర్లలో ఇప్పటివరకు కోటి రూపాయల కలెక్షన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లలో కలిపి మొత్తం నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసింది. కొన్ని రోజుల్లో కలెక్షన్స్ మరిన్ని పెరుగుతాయని ఆశిస్తున్నాను. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు" అని చెప్పారు.

సాయి కిరణ్ అడవి మాట్లాడుతూ "సినిమా బావుందని అందరు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు చాలా తృప్తిగా ఉంది" అని చెప్పారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ "చివరి వారంతో పోల్చుకుంటే ఈ వారం డబుల్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటిసారి మా నాన్నగారు సినిమాలో బాగా నటించావని, జనాలలో రెస్పాన్స్ బావుందని చెప్పి నన్ను హగ్ చేసుకున్నారు. మనసంతానువ్వే , నువ్వేకావాలి చిత్రాల తరువాత వచ్చిన మంచి ప్రేమ కథా చిత్రం ఇదే" అని చెప్పారు.

పార్వతీశం మాట్లాడుతూ "ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో తేజస్వి, విశ్వనాథం, సుకృతి తదితరులు పాల్గొన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ