Advertisementt

హృతిక్ స‌ర‌స‌న దీపికా.!

Sun 07th Jun 2015 06:48 AM
hrithik roshan,deepika padukone,hrithik roshan new movie,hrithik roshan,deepika pairup  హృతిక్ స‌ర‌స‌న దీపికా.!
హృతిక్ స‌ర‌స‌న దీపికా.!
Advertisement
Ads by CJ

 

బాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన క‌ల‌యిక‌లో సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్, దీపికా ప‌దుకొణే జంట‌గా య‌శ్‌రాజ్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. `ధూమ్ 3` ద‌ర్శ‌కుడు విజ‌య్‌కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ఈ చిత్రంలో దీపికా కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా చేయ‌బోతోంద‌ని స‌మాచారం. ఆమె ఇదివ‌ర‌కు `చాందినీ చౌక్ టు చైనా` అనే చిత్రంలో యాక్ష‌న్ ఇర‌గ‌దీసింది. ఇప్పుడు మ‌రోసారి హృతిక్‌కి ధీటుగా డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఫైట్లు చేయ‌బోతోంద‌ట‌. ఈ కాంబినేష‌న్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌లి కాలంలో ఇంత క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ఇదే అని మాట్లాడుకొంటున్నారు. హృతిక్ ప్ర‌స్తుతం `మొహంజ‌దారో` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. దీపికా ఇటీవ‌ల `పీకూ`తో అద‌ర‌గొట్టింది. దీపికా హృతిక్ కాంబినేష‌న్‌లో రానున్న  చిత్రంపై బిజినెస్ వ‌ర్గాలు ప్ర‌త్యేక‌మైన దృష్టిని కేంద్రీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ