ర‌కుల్ ఆ సినిమా ఒప్పుకొందా?

CineJosh news
స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూ య‌మా బిజీగా ఉంది  ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.  ఆమె కాల్షీట్లు దొరికితే పండ‌గే అనుకొనే ప‌రిస్థితి నిర్మాత‌ల‌ది. అంత జోరుమీదున్న ర‌కుల్  `బెంగుళూరు డేస్‌` రీమేక్‌లో ఓ చిన్న పాత్ర చేయ‌డానికి ఒప్పుకొందంటూ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో  ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అది ఎంత‌వ‌ర‌కు నిజం అన్న‌ది తేలాల్సి ఉంది. అయితే ర‌కుల్ `పండ‌గ చేస్కో`  ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది. ఆ సంద‌ర్భంలోనూ `బెంగుళూరు డేస్‌` రీమేక్ గురించి చెప్ప‌లేదు. కానీ చాలా మంది ర‌కుల్ ఆ సినిమా ఒప్పుకొంద‌ని మాట్లాడుకొంటున్నారు. సినిమాలో క‌థానాయిక‌గా అంటే ఒప్పుకొనిందేమో అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ అదొక చిన్న పాత్ర అట‌. పైపెచ్చు హ్యాండీక్యాప్డ్‌గా క‌నిపించాల్సి ఉంటుంద‌ట‌. గ్లామ‌ర్ కురిపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతున్న ర‌కుల్ అలాంటి పాత్ర ఒప్పుకొందంటే  ఎవ‌రైనా న‌మ్ముతారా?  ఆ విష‌యంపై  క్లారిటీ రావాలంటే ర‌కుల్ స్పందించాల్సిందే. 
rakulpreeth singh
pandaga chesko
rakul for banglore days remake
rakul preeth singh news