Advertisement

అతిధిగా మరోసారి దగ్గుబాటి రానా!

Thu 23rd Apr 2015 02:52 AM
daggubati rana,guest role,tamil movie,goutham menon movie  అతిధిగా మరోసారి దగ్గుబాటి రానా!
అతిధిగా మరోసారి దగ్గుబాటి రానా!
Advertisement

అతిధి పాత్రలకు దగ్గుబాటి రానా పేటెంట్ హక్కు తీసుకునేలా కనిపిస్తున్నారు. ఈ ఏడాది తెలుగులో సుధీర్ బాబు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మంచు లక్ష్మి దొంగాట సినిమాల్లో రానా అతిధిగా నటించారు. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరో తమిళ సినిమాలో అతిధి పాత్రలో కనిపించడానికి సై అన్నారని సమాచారం. 

శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అతిధిగా రానా సందడి చేయనున్నారట. స్క్రిప్ట్, తన క్యారేక్టరైజేషన్ నచ్చడంతో గౌతమ్ మీనన్ ప్రపోజల్ కు పచ్చజెండా ఊపారు. త్వరలో చిత్రీకరణలో పాల్గొంటారు. అని కోలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో ఆరంభం, సంథింగ్ సంథింగ్ తమిళ సినిమాల్లో రానా అతిధి పాత్రలలో నటించారు. బాహుబలి షూటింగ్ పూర్తి చేసిన రానా.. ప్రస్తుతం తమిళంలో బెంగుళూరు డేస్ రీమేక్ లో నటిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement